ఆంధ్రప్రదేశ్న్యూస్ప్రాంతీయంరాష్ట్రీయంవిశాఖపట్నం

స్వర్గీయ పి.వి.చలపతిరావు గారు అజాత శత్రువు.

చివరి శ్వాస వరకు సమాజం కోసం కార్మిక,కర్షక,పేదల సమస్యల కోసం పనిచేసిన గొప్ప పోరాట యోధులు.

నర్సీపట్నం : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,జనసంఘ్ నేత, బిజెపి తొలి అధ్యక్షులు, మాజీ శానమండలి సభ్యులు పి.వి.చలపతిరావు గారి సంతాప సభను, భారతీయ జనతాపార్టీ నర్సీపట్నం నియోజక వర్గం ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ ప్యాలస్ ఆవరణలో నిర్వహించడం జరిగింది.ఈ సంతాప సభలో పార్టీలకు ఆతితంగా ఆన్ని పార్టీల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. స్వర్గీయ పి.వి.చలపతిరావు గారు అజాత శత్రువు అని, ఉత్తరాంధ్ర లో మంచి సేవలు అందించారని చివరి శ్వాస వరకు సమాజం కోసం ఆలోచించిన కార్మిక, కర్షక, పేదల సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేసి చివరికి జైలు జీవితం కూడా గడిపారని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఆయన ఆదర్శమని కొనియాడారు. నివాళి అర్పించిన వారిలో కాంగ్రేస్ సీనియర్ నాయకులు పిసిసి సభ్యులు మీసాల సుబ్బన్న,వైయస్ఆర్ సి పి సీనియర్ నాయకులు శెట్టి మోహన్, టి.డి.పి జిల్లా మహిళా నాయకురాలు, నర్సీపట్నం జెడ్.పి.టి.సి సభ్యురాలు సుకల రమణమ్మ, బి.జె.పి సీనియర్ నాయకులు పొనగంటి అప్పారావు, రామచంద్ర రాజు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగార్రాజు మరియు ఉద్యమనేత, రుత్తల ఎర్రా పాత్రుడు సంతాప సభలో చలపతిరావు గారితో నర్సీపట్నం ప్రాంతంపై ఉన్న అనుబంధం జ్ఞాపకాలను తలచుకొంటూ కన్నీటి పర్యతమయ్యారు. చలపతిరావు గారినీ నేటి నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరితో కుటుంబ సభ్యులుగా మెలిగేవారని ఆయన మరణవార్త అందరినీ కలచివేసిందని ఆయన మరణం భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం మంచి నాయకుడిని కోల్పోయిందని ఆయన ఆత్మకు భగవంతుడు సద్గతులు కలగాలని ,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు, ఆయన ఆశయ సాధన ముందుకు తీసుకొని వెళ్లాలని కోరారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి , పుష్ప గుచ్చాలతో నివాళి  అర్పించారు.ఈ కార్యక్రమంలో బి.జె.పి నాయకులు గాదె శ్రీనివాసరావు, అసెంబ్లీ కో.ఆర్డినేటర్ కాళ్ల సుబ్బారావు, నియోజక వర్గ సంయోజక్, బి.జె.వై.యమ్ రాష్ట్ర పదాదికారి అడిగర్ల సతీష్, వివిధ మండలాల అధ్యక్షులు వెలగా జగన్నాద్, బొలేం శివ, గణేష్,యువ మోర్చా జిల్లా నాయకులు పృథ్వి,గవిరెడ్డి త్రినాధ్, గొంప సత్యనారాయణ, సబ్బి కుమార్ స్వామి, బావనా రుషి, యువమోర్చా మండల అధ్యక్షులు పల్లా గోవింద్, మర్రి నాయుడు, ఆర్.ఎస్.ఎస్,బి.జె.పి కార్యకర్తలు, అభిమానులు, శ్రేయాబిలాషులు, పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు…