న్యూస్ప్రాంతీయంరాష్ట్రీయం

తానా కవి సమ్మేళనానికి ఒడిశా నుంచి ఎంపికైన యువ జర్నలిస్టు సింహాద్రి శ్రీనివాస్ రావు .

జయపురం: ఉత్తర అమెరికా తెలుగు సంఘం”తానా” ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత్ మాహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ కవితల పోటీలు” నిర్వహించింది.ఈ పోటీలో ఒడిశా నుంచి సింహాద్రి శ్రీనివాస్ రావు యువ జర్నలిస్టు,కవి. కవిత “నా దేశంలో పల్లెటూరు” ఎంపికైంది,ఏప్రిల్ 22,23,24 కవి సమ్మేళన జరుగుతాయి. 22 న ప్రారంభమౌతున్న జూమ్ సమావేశంలో ప్రపంచస్థాయి కవితా వేదిక మీద సింహాద్రి తన కవితను వినిపించబోతున్నారు. “నా దేశంలో పల్లెటూరు” అనే కవిత మనదేశం ఒకప్పుడు పల్లెల్లు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో అనే కవిత ఈ పోటీలో ఎంపికైనది. ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు”తానా” అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి,తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి సింహాద్రి మనఃపూర్వక ధన్యవాదములు తెలియజేసారు.దేశ,విదేశాలనుండి అనేకమంది ప్రముఖులు,కవులు హాజరయ్యే ఈ “తానా కవితాలహరి” కార్యక్రమం “తానా” అధికారిక యూ ట్యూబ్ ఛానెల్,ఫేస్బుక్ ఛానెల్ లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.”యప్ టీవి” ద్వారా అమెరికాతో పాటు,యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.ఈటీవి భారత్,మన టీవి, టీవి ఆసియా తెలుగు మరియు ఇతర మాధ్యమాలలో ప్రసారం కానుంది అని సింహాద్రి శ్రీనివాస్ రావు తెలియజేశారు.