ఆంధ్రప్రదేశ్జిల్లాలున్యూస్ప్రాంతీయం

తాసిల్దార్ వి.వి రమణకు ఉత్తమ అధికారి అవార్డు

నర్సీపట్నం, కోస్తా టైమ్స్ ఆగస్టు 16 : నర్సీపట్నం తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న వి.వి రమణకు ఉత్తమ రెవిన్యూ అధికారిగా అవార్డు లభించింది. ఇన్చార్జి మంత్రివర్యులు టి రాజన్న దొర, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అనకాపల్లి జిల్లాలో జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల్లోనూ, జగనన్న హౌసింగ్ లేఅవుట్లు లోనూ చురుకుగా పనిచేస్తూ, నీతి నిజాయితీలతో పనిచేసే అధికారిగా గుర్తింపు పొంది, అధికారులు, నాయకుల మన్ననలు పొందారు. విధులలో ఉత్తమ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు అందించింది. ఈ సందర్భంగా నర్సీపట్నం మండలంలో పలువురు అధికారులు,నాయకులు, ప్రజలు, రెవిన్యూ సిబ్బంది, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.