ఆహారంరాజకీయంరాష్ట్రీయం

కేంధ్ర‌ప్ర‌భుత్వం నిధులుతో నిర్మిస్తున్న టిడ్కో గృహ స‌ముదాయాల‌కు వైయ‌స్ఆర్ పార్టీ రంగులు వేయ‌డంపై బిజెపి ఆందోళ‌న‌.

‌న‌ర్సీప‌ట్నం – కేంధ్ర‌ప్ర‌భుత్వం నిధులుతో నిర్మిస్తున్న టిడ్కో గృహ స‌ముదాయాల‌కు వైయ‌స్ఆర్ పార్టీ రంగులు వేయ‌డంపై ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు య‌డ్ల గ‌ణేష్ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రిగింది.శుక్ర‌వారం బ‌లిఘ‌ట్టం శివాల‌యం వ‌ద్ద నిర్వ‌హించి కార్య‌క్ర‌మంలో మున్సిపాలిటీలో గ‌త ప్ర‌భుత్వ హుయాంలో 2500 టిడ్కోఇళ్ళు స‌ముదాయంపై ప్ర‌స్తుత అధికార పార్టీ ప్ర‌భుతం రంగులు వేయ‌డంపై భార‌తీయ జ‌న‌తా పార్టీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంద‌ని పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు గాదే శ్రీనివాస‌రావు ‌పేర్కోన్నారు. ఏ నిభంద‌న‌లు ప్ర‌కారం ఈ రంగులు మారుస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కోర్టులు అనేక మార్లు అధికార ప్ర‌భుత్వాన్నిహెచ్చ‌రించిన అధికార్ల‌ల‌లో,నాయ‌కుల‌లో మార్పు రావ‌డం లేద‌న్నారు. ఇళ్లుకు వేసిన రంగుల‌ను తొల‌గించ‌క‌పోతే మా పార్టీ ఆధ్వ‌ర్యంలో తొల‌గించ‌డం జ‌రుగుతుంద‌‌ని హెచ్చ‌రించారు. అసెంబ్లీ క‌న్వీన‌ర్ కాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో ఎక్క‌డ‌లేని విధంగా మ‌న రాష్ట్రానికి సూమారు 7ల‌క్ష‌ల ఇళ్ళు ఇచ్చింద‌ని దానిని రాష్ట్రంలో దుర్వినియోగ‌ప‌ర్చే విధంగా ప్ర‌భుత్వ అధికారుల తీరు ఉంద‌న్నారు.ఈ టిడ్కో ఇళ్ళ‌కు రంగులు మార్చే విష‌యంలో అధికారుల తీరు చూస్తుంటే నాకు సంభందం లేదు నాకు సంభందం లేదు అని గుమ్మ‌డికాయ దొంగ‌లు భుజాలు త‌డుముకున్న‌ట్లు ఉంద‌న్నారు. ఈ రంగులు మార్చే విష‌యంలో అధికార పార్టీ నాయ‌కుల వ‌త్తిడికి లొంగ‌కుండా అధికారులు ప్ర‌జాధ‌నం కాపాడాల‌ని పేర్కోన్నారు. ప్ర‌స్తుతం వేసిన రంగులు తొల‌గించాల‌ని డిమాండ్ చేసారు. లేని ప‌క్షంలో ప్ర‌జ‌లే త‌గిన బుద్ది చెప్ప‌క మాన‌ర‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో లీగ‌ల్ సెల్ ప్ర‌తినిధి సుంక‌ర‌ణం విజ‌య్ ప్ర‌సాద్ ,ఓబిసి మోర్చా నాయ‌కులు బంగారు ఎర్రినాయుడు, గొంప వెంక‌టేశ్వ‌ర‌రావు, పి.వెంక‌టేశ్వ‌ర‌రావు, ప‌డాల నాగేశ్వ‌ర‌రావు నాత‌వ‌రం మండ‌ల అధ్య‌క్షులు లాలం వెంక‌ట‌ర‌మ‌ణ‌, ప‌ట్ట‌ణ ద‌ళిత‌మోర్చా అధ్య‌క్షులు నేత‌ల బుచ్చిరాజు,యువ‌మోర్చా రాష్ట్ర నాయ‌కులు బోళెం శివ ,ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు పృద్విరాజ్‌, వివ‌ధ మండ‌లాల కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గోన్నారు…