జాతీయం

నేడు అస్సాం, ప‌శ్చిమ బెంగాల్‌ను సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (న్యూస్‌టైమ్): ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సోమవారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు అస్సాం, ప‌శ్చిమ‌ బెంగాల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అస్సాంలోని ధెమాజిలోని శిలాప‌థార్ వ‌ద్ద ఏర్పాటు చేసే కార్య‌క్ర‌మంలో కీల‌క చ‌మురు, గ్యాస్ రంగ ప్రాజెక్టుల‌ను ఆయ‌న జాతికి అంకితం చేయ‌నున్నారు. అలాగే, ఆయ‌న అస్సాంలో ఇంజ‌నీరింగ్ కాలేజీల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి ప‌శ్చిమ‌ బెంగాల్‌లోని హుగ్లీలో ప‌లు రైల్వే ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఇండియ‌న్ ఆయిల్ బొంగైగామ్ రిఫైన‌రీలో ఇండ్ మాక్స్ యూనిట్‌ను జాతికి అంకితం చేయ‌నున్నారు. అలాగే ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండ‌వ ట్యాంక్ ఫార‌మ్‌ను దిబ్రూఘ‌డ్ వ‌ద్ద‌గ‌ల మ‌ధుబ‌న్‌లోను, తిన్‌సుకియా మాకుమ్ వ‌ద్ద‌గ‌ల హెబెడా గ్రామం వ‌ద్ద ఒక గ్యాస్ కంప్రెస‌ర్ స్టేష‌న్‌ను ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేయ‌నున్నారు.

ప్ర‌ధాన‌మంత్రి ధెమాజి ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించనున్నారు. అలాగే సుయాల్‌కుచి ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాప‌న చేయ‌నున్నారు.ఈ ప్రాజెక్టులు ఇంధ‌న భ‌ద్ర‌త‌, సుసంప‌న్న‌త‌ను క‌ల్పించ‌డంతోపాటు స్థానిక యువ‌త‌కు అద్భుత అవ‌కాశాలు క‌ల్పించ‌నున్నాయి. ఇవి తూర్పు భార‌త దేశ సాంఘిక ఆర్ధిక ప్ర‌గ‌తికి వీలు క‌ల్పించేలాప్ర‌ధాన‌మంత్రి దార్శ‌నిక‌త అయిన‌ పూర్వోద‌య కు అనుగుణంగా ఉన్నాయి. అస్సాం గ‌వ‌ర్న‌ర్‌, అస్సాం ముఖ్య‌మంత్రి, కేంద్ర పెట్రోలియం స‌హ‌జ‌వాయు శాఖ మంత్రి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఇండియ‌న్ ఆయిల్ వారి బొంగైగామ్ రిఫైన‌రీవ‌ద్ద గ‌ల ద ఇండ్ మాక్స్ యూనిట్ అధిక ఎల్‌పిజి ఉత్ప‌త్తి చేసేందుకు ఇండియ‌న్ ఆయిల్‌- ప‌రిశోధ‌న అభివృద్ధి దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. ఇది భారీ ఫీడ్‌స్టాక్‌ల నుంచి ఎక్కువ ఆక్టేన్ గాసోలీన్‌ను సాధిస్తుంది. ఈ యూనిట్ రిఫైన‌రీ వారి ముడి చ‌మురు ప్రాసెసింగ్ సామ‌ర్థ్యాన్ని 2.35 ఎంఎంటిపిఎ (ఏడాదికి మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నులు) నుంచి 2.7 ఎంఎంటిపిఎ కు పెంచ‌నుంది. ఇది ఉత్ప‌త్తి ప్రారంభం ప్రారంభిస్తే ఎల్‌పిజి ఉత్ప‌త్తిని 50 టిఎంటి (వేల‌ మెట్రిక్ ట‌న్నులు) నుంచి 257 టిఎంటిల‌కు పెంచ‌నుంది. అలాగే మోటార్ స్పిరిట్‌(పెట్రొల్‌) ఉత్ప‌త్తిని 210 టిఎంటి ల‌నుంచి 533 టిఎంటిల‌కు పెంచ‌నుంది.

ఆయిల్ ఇండియా లిమిటెడ్ సెకండ‌రీ ట్యాంక్ ఫార్మ్‌ను 40,000 కిలో లీట‌ర్ల క్రూడ్ ఆయిల్ సుర‌క్షిత నిల్వ కోసం నిర్మించ‌డం జ‌రిగింది. అలాగే వెట్ క్రూడ్ ఆయిల్‌నుంచి ఫార్మేష‌న్ వాట‌ర్‌ను వేరు చేస్తారు. ఈ 490 కోట్ల రూపాయ‌ల ప్రాజెక్టులో డీ హైడ్రేష‌న్ యూనిట్ కూడా ఉంది. దీని ప్రారంభ సామ‌ర్థ్యం రోజుకు 10 వేల కిలో లీట‌ర్లు. తిన్‌సుకియా మ‌కుమ్ వ‌ద్ద‌గ‌ల గ్యాస్ కంప్రెసర్ స్టేష‌న్ దేశ క్రూడ్ ఆయిల్ ఉత్ప‌త్తిని సుమారు 16,500 మెట్రిక్ ట‌న్నుల‌కు పెంచుతుంది. దీనిని 132 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించారు. ఈ స్టేష‌న్ 3 త‌క్కువ ప్రెష‌ర్ బూస్ట‌ర్ కంప్రెష‌ర్‌, 3 అధిక ప్రెష‌ర్ లిఫ్ట‌ర్ కంప్రెష‌ర్ క‌లిగి ఉంటాయి. ధెమాజి ఇంజ‌నీరింగ్ కాలేజీ ని 276 భీగాల స్థ‌లంలో సుమారు 45 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించారు. ఇది అస్సాంలో ఏడ‌వ ప్ర‌భుత్వ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌. ఇందులో బిటెక్ సివిల్‌, మెకానిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్సు కోర్సులు ఉంటాయి. సుయాల్‌కుచి ఇంజ‌నీరింగ్ కాలేజీకి ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. దీనిని 116 బీఘాల స్థ‌లంలో సుమారు 55 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించ‌నున్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్‌లో ప్ర‌ధాని కార్య‌క్రమాలు…

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప‌శ్చిమ‌బెంగాల్‌లో నోవాపారా నుంచి ద‌క్షిణేశ్వ‌ర్‌కు మెట్రొరైలు మార్గ పొడిగింపును ప్రారంభిస్తారు. అలాగే ఈ మార్గంలొ తొలి రైలు స‌ర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారు. 4.1 కిలోమీట‌ర్ల విస్త‌ర‌ణ ప‌నుల‌ను సుమారు 464 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో చేప‌ట్టారు. దీనికి పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తో నిర్మించారు. ఇది న‌గ‌రంలో ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించి ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఈ రైలు మెట్రో మార్గ పొడిగింపు కాలీఘాట్‌లోని ప్ర‌పంచ ప్ర‌సిద్ధ కాళీ మందిరం, ద‌క్షిణేశ్వ‌ర్‌ల‌ను ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులోకి తెస్తుంది. ల‌క్ష‌లాది మంది ప‌ర్యాట‌కులు, భ‌క్తుల‌కు ఇది ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. కొత్త‌గా నిర్మించిన రెండు స్టేష‌న్లు బ‌రాన‌గ‌ర్‌, ద‌క్షిణేశ్వ‌ర్‌ల‌లో ప్ర‌యాణికులకు ఆధునిక‌ స‌దుపాయాలు క‌ల్పించారు. వీటిని ఆత్యంత ఆక‌ర్ష‌ణీయంగా అంద‌మైన చిత్రాలు, శిల్పాలు, ప్ర‌తిమ‌ల‌తో నిర్మించారు.

ప్ర‌దాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఖ‌ర‌గ్‌పూర్ – ఆదిత్య‌పూర్ 132 కిలోమీట‌ర్ల మార్గంలో 30 కిలోమీట‌ర్ల పొడ‌వున క‌లైకుంద‌, జార్‌గ్రామ్‌మ‌ధ్య ఆగ్నేయ రైల్వేకు చెందిన మూడో రైల్వే లైన్ ప్రాజెక్టును ప్రారంభించ‌నున్నారు. దీనిని 1312 కోట్ల రూపాయ‌ల అంచ‌నాల‌తో ఆమోదించ‌డం జ‌రిగింది. క‌లైకుండా, జార్‌గ్రామ్‌మ‌ధ్య‌గ‌ల నాలుగు స్టేష‌న్ల‌ను నాలుగు కొత్త స్టేష‌న్ భ‌వ‌నాల‌న నిర్మాణం ద్వార తిరిగి అభివృద్ధి చేయ‌డం జ‌ర‌గింది. ఆరు కొత్త ఫుట్ ఒవ‌ర్ బ్రిడ్జిలు, 11 కొత్త ప్లాట్‌ఫార‌మ్‌లు, అలాగే ప్ర‌స్తుత మౌలిక‌సదుపాయాల ఆధునీక‌ర‌ణ చేప‌ట్ట‌డం జ‌రిగింది. ఇది హౌరా- ముంబాయి ట్రంక్ మార్గంలో ప్ర‌యాణికుల రాక‌పోక‌లు నిరంత‌రాయంగా కొన‌సాగ‌డానికి వీలు క‌లిగిస్తుంది. అజిమ్‌గంజ్ నుంచి ఖ‌ర్గ‌ఘాట్ రోడ్ సెక్ష‌న్ మార్గం డ‌బ్లింగ్‌ను ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేయ‌నున్నారు. ఇది తూర్పు రైల్వేలోని హౌరా-బందేల్‌- అజీంగంజ్ సెక్ష‌న్‌లో భాగంగా ఉంది. ఈ మార్గాన్ని సుమారు 240 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో నిర్మించారు.

దంకుని, బ‌రుయిపారా (11.28 కిలోమీట‌ర్ల‌) హౌరా- బ‌ర్ధ‌న‌మ్ కోర్డ్ లైన్ అలాగే హౌరా- బ‌ర్ధ‌మాన్ మెయిన్ లైన్లోని ర‌సూల్‌పూర్‌, మాగ్రా (42.42 కిలోమీట‌ర్లు) మూడో లైన్‌ను ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేయ‌నున్నారు. ఇది కోల్‌క‌తాకు ప్ర‌ధాన గేట్‌వేగా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ర‌సూల్‌పూర్, మాగ్రా మూడోలైన్‌ను సుమారు 759 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించ‌డం జ‌రిగింది. డంకుని, బ‌రూయిపారా మ‌ధ్య నాలుగోలైనును 195 కోట్ల రూపాయ‌ల వ్య‌వ‌యంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టులు మ‌రింత మెరుగైన నిర్వ‌హ‌ణ‌కు, త‌క్కువ స‌మ‌యంలో గ‌మ్య స్థానం చేర‌డానికి, మ‌రింత భ‌ద్ర‌త‌తో రైలుస‌ర్వీసుల న‌డ‌ప‌డానికి మొత్తంగా ఈ ప్రాంత ఆర్ధిక ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డ‌నున్నాయి.