ఆహారంసంస్కృతి

శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ..

తిరుమల: బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ…ఈ నెల 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రోజుకు 16 వేల టికెట్ల చొప్పున 15 స్లాట్లలో టికెట్లు విడుదల చేసారు.నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది.గత నెలలో జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేసి ఏకాంతంగా నిర్వహించిన టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మాత్రం పరిమిత సంఖ్యలో భక్తులను గ్యాలరీల్లోకి అనుమతిస్తున్నారు.స్వామివారి వాహనసేవలను మాడవీధుల్లో జరపాలని నిర్ణయించింది. భక్తులు భౌతిక దూరం పాటించేలా నాలుగు మాడవీధుల్లో సర్కిల్‌ మార్కింగ్‌ పనులు గురువారం పూర్తిచేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 15న అంకురార్పణను నిర్వహించనున్నారు…