ఆహారంరాష్ట్రీయంస్థానికం

రేపు జరిగే భారతీయ జనతా పార్టీ మూడవ వర్చువల్ బహిరంగ ర్యాలీని విజయవంతం చేయండి.

అమరావతి : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మూడవ వర్చువల్ బహిరంగ ర్యాలీని 26జూన్ 2020 శుక్రవారం  4గంటలకు ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ నాయకులు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ గారు డిల్లీ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వార పాల్గొంటారన్నారు. రాష్ట్రానికి కేంద్రంనుండి చేసిన ఆర్థిక సహకారం, భవిష్యత్ లో ఆత్మనిర్భర భారత్ నుండి చేపట్టనున్న ఇతర పధకాలతో పాటు నూతన సహకారం గురించి,రాష్ట్రంలో అమలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ ఫతకాలతో పాటు రాష్ట్రలో వై,యస్,ఆర్ ప్రభుత్వం కేంద్ర పధకాలపేర్లు మార్చడం, ప్రజావ్యత్రిరేక నిర్ణయాలు సైతం ప్రజలకు వివరిస్తామన్నారు. బిజెపి రెండోసారి అధికారంలో మొదటి సంవత్సరం అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు  తెలియజేయడానికి ఈ సభలును నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ ర్యాలీ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ గారితో పాటు అద్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ,అఖిల భారత కార్యదర్శి సత్య కుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునిల్ దియోదర్, యంపి జీ.వి.యల్ నరసింహరావు , ఎమ్మెల్సీలు సోము వీర్రాజు,పివియన్ మాదవ్ తో పాటు ఇతర రాష్ట్ర నేతలు పాల్గొనబోతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా భౌతికదూరం పాటిస్తూ 30 చోట్ల యల్ఇడి, తెరలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కోస్తా జిల్లాల ప్రజలు,అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు…