ఆహారంప్రాంతీయం

రైలు పట్టాలు దాటుతుండగా అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

సామర్లకోట : తేది – ౦1-౦7-2౦2౦న మధ్యాహ్నం సుమారు ౦1.౩౦గంటల సమయంలో సుమారు 60-65 సం.లు పురుషుడు చేపూరు గ్రామము వద్ద రైలుపట్టాలు దాటుచు రాజమండ్రి వైపు నుండి విశాఖపట్నం వైపు వెళ్లే ఏదో గుర్తు తెలియని రైలుబండి గుద్దుట వలన.అక్కడిక్కడే మరణించాడు.ఈ కేసు రైల్వే సబ్-ఇనస్పెక్టర్ ఎస్.కె అబ్దుల్ మరూప్ దర్యప్తు చేసి మృతుడు మామిడి తాతబ్బాయి S/o కోటయ్య,వయసు 6౦సంవత్సరాలు, యాదవ, చేపూరు వాసిగా గుర్తించామని తెలిపారు. బహిర్భూమికి వెళ్లివస్తానని చెప్పి వెళ్లి రైలు పట్టాలు దాటుచుండగా రైలుబండిని గమనించక పోవుటవలన సదరు రైలుబండి గుద్దుటంచే చనిపోయాడన్నారు.మృతదేహాన్ని శవ పరీక్ష అనంతరం రక్తబంధువులకు అప్పగించామని తెలిపారు…