ఆంధ్రప్రదేశ్న్యూస్ప్రాంతీయంరాజకీయంవిశాఖపట్నం

తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలి.

*రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని లిక్విటేషన్ ప్రకటించడం దారుణం.

అనకాపల్లి,కోస్తాటైమ్స్ (ఫిబ్రవరి -19) : తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని సుగర్ ఫ్యాక్టరీ దివాలా సంస్థగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం నిరసిస్తూ వెంటనే వెనక తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ రైతు నాయకులు పీలా మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివాలా సంస్థగా ప్రకటించడం వెనక తీసుకోవాలని ఈ ఫ్యాక్టరీని ఆధునికరణ చేయవలసిన అవసరం ఉందని గత ఎన్నికల్లో పాదయాత్రలో సమయంలో ఈ ఫ్యాక్టరీని అన్ని విధాలుగా ఆధునీకరణ చేస్తామని రైతు ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం చెప్పుకొని అధికారంలోకి వచ్చిందని వైసిపి ప్రభుత్వం వెంటనే మాట మీద నిలబడి ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలను కూడా తిరిగి తెరిపించాలని రైతు నాయకులు మురళి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల నుంచి షేర్లు సేకరించి షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు వివి రమణ కొన్నారని షేర్ రూపంలో సేకరించి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని రైతుల యొక్క కష్టంతో కొన్న ఫ్యాక్టరీ ఈ ఆస్తులు స్థలాలు నేడు అత్యంత విలువైన స్థలాలుగా ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వపరంగా లిక్విటేషన్ ప్రకటించడం దురదృష్టకరంగా భావిస్తూ వెంటనే ఫ్యాక్టరీ తాలూకా ఆస్తులను కాపాడుతూ ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి రైతులకు కార్మికులకు పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు ముడిపడి ఉన్నందున వెంటనే ఫ్యాక్టరీ తెరిపించడానికి అవకాశాలన్నీ పరిశీలించాలని అన్వేషించాలి అని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కోసం సహకార రంగాల కోసం రైతు ఉత్పత్తి కేంద్రాల కోసం 1,80,000 కోట్లు కేటాయించిందని సమగ్రమైన నివేదికతో రాష్ట్ర సుగర్ ఫ్యాక్టరీలను తెరిపించే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంప్రదించాలని ప్రభుత్వం సహకార సంస్థలను ఇండిపెండెంట్ ఇన్చార్జిలతో ఐఏఎస్ అధికారులు నియమించి ఫ్యాక్టరీలకు మూలధనాన్ని ఏర్పాటు చేసి ఆధునికంచవలసిన అవసరం ఉందని కేంద్రంలో ఉన్న నేషనల్ షుగర్ ఫెడరేషన్ వద్ద ఉన్న నిధులను ఉపయోగించుకొని రైతులకు న్యాయం చేయాలని దివాలా సంస్థ ప్రకటించడం దారుణమని ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని రైతు సంఘాలు తరఫున భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులుగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో సీనియర్ రైతు నాయకులు మద్దాల ఎరుక నాయుడు తదితరులు పాల్గొన్నారు…