ఆహారంప్రాంతీయం

సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు మంచిది కాదు.

నర్సీపట్నం : నియోజకవర్గ పరిధిలో గల గొలుగొండ మండలం పాత కేడీపేట ,కొంగసింగి,  సి,హెచ్ నాగాపురం గ్రామాలలో ప్రస్తుత ప్రభుత్వ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్లు నియమించడం జరిగింది.ఈ వాలంటీర్స్ విధులు సక్రమంగా నిర్వహించకుండా సంక్షేమ పథకాలలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు పాల్పడుతున్నారని జనసేన నియోజకవర్గం నాయకులు రాజన వీర సూర్య చంద్ర పేర్కొన్నారు.ఈరోజు పాత కేడీపేట గ్రామంలో గొలుగొండ జనసేన ముఖ్య నాయకుల సమావేశంలో సూర్యచంద్ర మాట్లాడుతూ గొలుగొండ మండలంలో వాలంటీర్లపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మండలంలో వాహన మిత్ర పథకంలో వాలంటీర్లు చేతివాటం చూపించారని ఈ మధ్యనే విడుదల చేసిన కాపు నేస్తం అర్హులు కూడా అనర్హులుగా చూపించి కేవలం వైసిపి సానుభూతి పరులకు మాత్రమే వచ్చేలా కృషి చేస్తున్న వాలంటీర్లుకు ఇది ఏమాత్రం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలులో పార్టీ చూడం అని చెబుతూ ఉంటే గ్రామస్థాయిలో వైసిపి పెద్దల అండదండలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వాలంటీర్లు ఈపద్ధతి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. కొంగసింగి గ్రామంలో పురాతన కాలం నుండి మరిడిమాంబ గుడికి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూమిని ఇండ్ల స్థలములుకు కేటాయించడం వలన గుడి మార్గం మూతకు గురౌతుందని దీనివలన గుడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడతారన్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని వేరే చోటుకు మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ముప్పిన రామకష్ణ,ఎస్ మనిబాబు, పవన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.