అమరావతి, జనవరి 27 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చర్యలతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తుంగభద్ర కాలువల్లో జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు సీఎం వైయస్ జగన్ ఏర్పాటు చేయించిన టెలిమెట్రి పరికరాల వల్ల కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని సుమారు 6 లక్షల ఎకరాలకు నీరు అందుతోందన్నిరు.
‘‘హెచ్ఎల్‌సీ, ఎల్ఎల్‌సీ కాల్వలకు 54 టీఎంసీల కేటాయింపు ఉన్నా దశాబ్దాలుగా సగం నీరు కూడా రాని పరిస్థితి. ఇప్పుడా సమస్య పరిష్కారమైంది.’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న పోలీస్ అధికారులను విజయసాయిరెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 18 పోలీసు మెడల్స్‌కు ఎంపికైన అధికారుల, సిబ్బందికి అభినందనలు. విధి నిర్వహణలో ప్రతిభ, నిజాయితీలు కనబర్చినందుకు పతకాలు దక్కాయి. మెడల్స్ పొందిన స్ఫూర్తితో పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచుతారని ఆశిస్తున్నా.’’ అంటూ ట్వీట్ చేశారు. అందరికీ కష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, జీవితం అక్కడితో ఆగిపోదు. సంతోషకరమైన జీవితం అనేది నీ దగ్గరకు రాదు. నువ్వే దానిని సంతోషంగా తీర్చిదిద్దుకోవాలి.’’ అంటూ అంతకు ముందు ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.