రాజకీయంరాష్ట్రీయం

‘ఏకగ్రీవాలను స్వాగతించండి’

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ…

అమరావతి, జనవరి 27 (న్యూస్‌టైమ్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను స్వాగతించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారి సంజయ్ అదే బాధ్యతలు చూస్తారన్నారు. ఏకగ్రీవాలు బలవంతంగా అవుతున్నాయా? లేదా అన్నదే పర్యవేక్షిస్తారని చెప్పారు. అయితే, మొదటి ప్రాధాన్యంగా ఎన్నికలు తీసుకోవాలని సూచించారు. తరువాత స్థానాల్లో సంక్షేమం కూడా తీసుకోవాలని, కాల్‌ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని నిమ్మగడ్డ సూచించారు.

వెబ్‌కాస్టింగ్‌తో ఉపయోగం లేదని, పోలింగ్‌ కేంద్రం చుట్టూ కొంత ప్రాంతాన్నే అది కవర్‌ చేస్తుందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. వెబ్‌ కాస్టింగ్‌ కోసం కొత్త యాప్‌‌ను తీసుకువచ్చామని, ఆ యాప్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల దగ్గర జరిగేదంతా తెలుసుకోవచ్చునని అన్నారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితిలో వ్యాక్సినేషన్‌ ఆగకూడదని అన్నారు. యాప్‌ ద్వారా వీడియోలతో పాటు ఎస్ఎంఎస్ కూడా పంపవచ్చునని రమేష్ కుమార్ పేర్కొన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యాక్సినేషన్‌తో పాటు ఎన్నికల నిర్వహణపై చర్చించామన్నారు. ఎన్నికల నిర్వహణలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని డీజీపీ వ్యాఖ్యానించారు.