రాష్ట్రీయం

ఎన్నికలకు ఆరాటం దేనికి?

ఏలూరు, జనవరి 24 (న్యూస్‌టైమ్): ప్రపంచమంతా కోవిడ్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంటే ఒకవైపు వ్యాక్సినేషన్ జరుగుతుంటే మరోవైపు ఉన్నఫలంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఎందుకు ఆరాటపడుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు పుప్పాల వాసు బాబు, కొట్టారు అబ్బయ్య చౌదరి, ఉన్నమట్ల ఎలిజా ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా కోటికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించడమే కాకుండా, కోవిడ్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని మరోవైపు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను అన్ని విధాల ఆదుకుంటుందని వారు తెలిపారు.

ఏలూరులోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు పుప్పాల వాసు బాబు, కొట్టారు అబ్బయ్య చౌదరి, ఉన్నమట్ల ఎలిజా కలసి తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, పరిచయాల కోసం ఎన్నికల కమిషనర్ స్థానంలో ఉన్నవారు వ్యవస్థలను ఉపయోగించుకోవడం సుచనియమని ఎన్నికలు ఆయన పెడితే కోవిడ్ ప్రజలకు ఇబ్బందులు వస్తే ప్రభుత్వానికి బాధ్యత ప్రభుత్వంపై నెట్టివేసి మళ్లీ బ్లాక్ మెయిలింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మంత్రి ఆళ్ల నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యేలు పుప్పాల వాసు బాబు, కొట్టారు అబ్బయ్య చౌదరి, ఉన్న మట్ల ఎలిజా ఘాటుగా విమర్శించారు.

గడువు ముగిసిన చంద్రబాబు హయాంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని అధికార పార్టీతోపాటు బాధ్యత ఉన్నది ఎన్నికల కమిషనర్ గుర్తెరగాలి అని ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తుల ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 10 శాతం సీట్లు కూడా రావని ప్రజల మధ్య ఉండి గొప్ప పరిపాలన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఇంట్లో కూర్చొని ప్రజాస్వామ్యం జిందాబాద్ అనే ప్రతిపక్షం ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం ఈ రాష్ట్ర ప్రజల కర్మ అని వారు దుయ్య పట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరోజైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నడా? ఈ రాష్ట్రాన్ని వదలని చంద్రబాబు లాంటి శనిని వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆఖరికి చంద్రబాబు ప్రచారం చేసిన సీట్లు, ఓట్లు రావని వారు విమర్శించారు.

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి స్పూర్తితో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎన్నికల ప్రణాళికలో పెట్టిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారని అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంటే అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడును ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు అన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వారు ఎవరైనా వ్యవస్థలను కాపాడాలి కానీ వ్యక్తులను కాపాడవలసిన పనిలేదని, వ్యక్తుల కోసం పని చేస్తే వ్యవస్థలు దెబ్బతింటాయని పంచాయతీ ఎన్నికలు అంటేనే పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు ఏకగ్రీవం అయితే ప్రోత్సాహం నిధులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ఎన్నికల కమిషనర్ తనకు ఉన్న దురుద్దేశం ఏమిటో స్పష్టంగా అర్థమవుతుందని ఇటువంటి వ్యక్తులు వ్యవస్థలో ఉండటం దురదృష్టకరమని ఈ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రతి పౌరుడు రక్షణ కోసం పని చేస్తుందని మంత్రి ఆళ్ల నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యేలు పుప్పాల వాసు బాబు, కొట్టారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు.

రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగవలసి ఉంటే 2021లో జరగడానికి ప్రధాన కారకులు ఎవరు అని ఎన్నికల కమిషనర్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నాం? సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సినేషన్ వేయడానికి సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఈ తరుణంలో ఎవరి ప్రాపకం కోసం, రాజకీయ లబ్దికోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారో ఎన్నికల కమిషనర్ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో అద్దాలు పెట్టుకొని ప్రెస్ మీట్ నిర్వహించారు, మీకు అంత భయం ఉంటే రాష్ట్రంలో ఉద్యోగులందరూ ఎన్నికల విధుల్లో పాల్గొంటే వారి ప్రాణానికి బాధ్యులు ఎవరో బాధ్యత వహిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను సూటిగా ప్రశ్నించారు.

నియంతృత్వ పోకడలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ ఫ్రంట్లైన్ వారియర్స్‌కు రక్షణ కల్పించక పోగా వారి భద్రతకు ముప్పు ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. రాజ్యాంగంలో కూడా ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించాలని ఎక్కడా చెప్పలేదని ఇప్పటికే ఎన్జీవోలు ఎన్నికల విధులు బహిష్కరిస్తామని ప్రకటన చేశారని, ఎన్నికలు వద్దు అని ప్రజలు ఉద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏమిటి అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను వారు సూటిగా ప్రశ్నించారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని దానిని ఎన్నికల కమిషనర్ కాలరాస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారని రాజ్యాంగ పదవిలో ఉన్న మీకు ఇవన్నీ పట్టవా? కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాలకోసం మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల ధన, మానలకు భంగం వాటిల్లుతుందని దీనిపై పునరాలోచన చేయవలసిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ఉందని మంత్రి ఆళ్ల నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు పుప్పాల వాసు బాబు, కొట్టారు అబ్బయ్య చౌదరి, ఉన్నమట్ల ఎలిజా పేర్కొన్నారు.