‘దేశం గర్వించే స్థాయికి యువత ఎదగాలి’

విశాఖపట్నం, ఫిబ్రవరి 8 (న్యూస్‌టైమ్): దేశం గర్వించే స్థాయికి యువత ఎదగాలని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని నగరానికి సోమవారం తిరిగి వచ్చిన విద్యార్థులను ఆయన తన కార్యాలయంలో అభినందించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో గర్వకారణమన్నారు. ఇటువంటి అరుదైన అవకాశాలు విద్యార్థి దశలో లభించడం చిరాస్థాయిగా గుర్తుంటాయన్నారు.

ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యాలను స్థిరపరచుకుని వాటిని సాధించే దిశగా ప్రయత్నించాలన్నారు. తమ ప్రతిభతో వర్సిటీకి, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చే దిశగా పాటు పడాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్, పెరేడ్‌లో పాల్గొన్న విద్యార్థులు డి.యువరాజ్, బి. అనీల్ కుమార్, బి. గాయత్రి తుషార, బి. ఏంజిలీనా, ఎం.భావన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరేడ్ విశేషాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

Latest News