ఆహారంరాజకీయంస్థానికం

వైయస్‌ఆర్‌ జయంతి రోజున రైతు దినోత్సవం రైతులకు లబ్ధిచేకూర్చే పలు కార్యక్రమాలు.

  • ప్రారంభం రేపు మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్న సీఎం

అమరావతి: వైయస్సార్‌ రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను చేపట్టనుంది. కడప జిల్లా పర్యటన నుంచి రేపు ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఆతర్వాత మధ్యాహ్నం రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.దీంట్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీల కింద 2014 నుంచి 2018 వరకూ రైతులకు చెల్లించాల్సిన రూ. 1046.60 కోట్ల చెల్లింపును రేపటినుంచి ప్రారంభిస్తారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి జమచేస్తారు.వ్యవసాయంలో ఉత్పత్తిపెంపు, కూలీల కొరత ఇబ్బందులను అధిగమించడానికి, తద్వారా పెట్టుబడులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున యాంత్రీకరణను ప్రోత్సహించనుంది. రూ.1650 కోట్లతో యంత్ర సేవా కేంద్రాలను చేపట్టనుంది. రైతు భరోసా కేంద్రాలద్వారానే ఈకార్యక్రమం జరగనుంది. 10,614 వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో రూ. 1572 కోట్ల యంత్రాలను ఉంచనున్నారు. ఒక్కో రైతు భరోసాకేంద్రం వద్ద కనీసం రూ.10 నుంచి 15లక్షల విలువైన యంత్రాలను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే 65 ఆర్బీకే హబ్‌ల వద్దకూడా రూ. 78 కోట్ల విలువైన యంత్రాలను ఉంచనున్నారు. ఒక్కో హబ్‌ వద్ద రూ. 1.2 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలను పెడుతున్నారు. ఇవి గ్రామాల్లో పెద్ద ఎత్తున మార్పులను తీసుకురావడానికి దోహదపడతాయి. బుధవారం రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ గారు ఈకార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

వ్యవసాయంతో యాంత్రీకరణ చర్యల్లో భాగంగా మూడు వ్యవసాయ యంత్ర శిక్షణ కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని నైరా, తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట, కర్నూలు జిల్లాలోని తంగడంచల్లో రూ. 42 కోట్ల వ్యవయంతో ఈ మూడు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ మూడు కేంద్రాలద్వారా ఏడాదికి 1500 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. వీటిని కూడా సీఎం బుధవారం (జులై 8,2020) ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలిపే ఉద్దేశంతో డాక్టర్‌ వైయస్సార్‌ రైతు భరోసా మాసపత్రికను వ్యవసాయశాఖ ప్రారంభిస్తోంది. పంటల సాగులో మెలకువలు, ప్రభుత్వం చేపట్టనున్న వివిధ పథకాల వివరాలు, మార్కెట్‌ధరలు, వాతావరణం తదితర అంశాలపై ఈ మాస పత్రికను రైతులకు అందుబాటులోకి తీసుకు రానుంది. దీన్నికూడా ముఖ్యమంత్రి బుధవారం నాడు రైతు దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నారు.వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల సహాయం, వైయస్సార్‌ రైతు భరోసా, కౌలు రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన పంట సాగుదారు హక్కు పత్రం, వరిలో సరైన మోతాదుల్లో ఎరువుల వాడకం, సమగ్ర ఎరువుల యాజమాన్యం, రైతులకు సలహాలకోసం ఉద్దేశించిన 155251కు టోల్‌ ఫ్రీ నంబర్‌కు సంబంధించిన పోస్టర్లను ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌గారు ఆవిష్కరించనున్నారు.

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం:
మత్స్యకారుల జీవన ప్రమాణాలను మార్చేందుకు, వారి ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు, సముద్రంలో పెద్ద ఎత్తున ఫిషింగ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8 చోట్ల ఫిషింగ్‌ హార్బర్లను, 4 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లను నిర్మించనుంది. ఫిషింగ్‌ హార్బర్లలో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లకు నాబార్డ్‌ ఆర్థిక సహాయం అందించనుంది. దీనికోసం రేపు అవగాహనా ఒప్పందం కుదరనుంది. 8 ఫిషింగ్‌ హార్బర్లకు, 4 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లకోసం దాదాపు రూ.3వేల కోట్లను ప్రభుత్వం ఖర్చుచేయనుంది. ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటుద్వారా 11,280 బోట్లను నిలుపుకునే సౌకర్యం వస్తుంది. తద్వారా ట్యానా చేపలు శుభ్రం చేయడానికి, నిల్వకోసం వసతులు ఏర్పడతాయి. కోల్డు స్టోరేజీలు అందుబాటులోకి వస్తాయి. అదనంగా 4.22 లక్షల టన్నుల సముద్రపు ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. దాదాపు 1.12లక్షలమందికిపైగా మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని అంచనా.

పశు సంవర్థక కార్యక్రమాలు :
రాష్ట్రంలోని 10,641 రైతు భరోసా కేంద్రాల్లో పశుసంవర్థక శాఖ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. 6705 వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో కృత్రిమ గర్భదారణ సేవలు అందించనున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా కొత్తగా 1021 కేంద్రాల్లో పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలను ప్రారంభించనున్నారు. 2 లక్షల పాడిపశువుల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. వీటితోపాటు పశువులకు ఆరోగ్య సంరక్షణ కార్డులను ఉచిత పశువైద్య శిబిరాల ద్వారా అందించనున్నారు. వివిధ వ్యాదులకు వైద్యాన్ని కూడా ఈ శిబిరాల్లో అందిస్తారు. జూలై 8 నుండి జూలై 15వరకూ అధిక పోషక విలువలు ఉన్న పశుగ్రాస వంగడాలను రైతులకు పరిచయం చేస్తారు. వీటిపై రైతులకు అవగాహన కల్పిస్తారు.

చెరుకు రైతులకు బకాయిలు చెల్లింపు:
రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు చెల్లించాల్సిన రూ. 54.6 కోట్ల బకాయిలను కూడా రేపు చెల్లించనున్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బును పంపే కార్యక్రమాన్ని సీఎం రైతు దినోత్సవం రోజున ప్రారంభిస్తారు…