ఆహారంప్రాంతీయం

రామారావు పేటలో వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో సరుకులు కూరగాయల పంపిణీ.

నర్సీపట్నం: పట్టణంలోని రామారావు పేట, 8వ వార్డు పరిధిలో వైయస్సార్ పార్టీ టౌన్ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు,కూరగాయలు వార్డు ప్రజలకు ఇంటింటికి వెళ్లి పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన వార్డు ప్రజలకు సేవా దృక్పథంతో నా వంతు సహాయంగా అందిస్తున్నాని తెలిపారు. కరోనా మహమ్మారికి ప్రజలను ఎవ్వరూ బయటకు రావద్దని ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాషా, సిద్ధ,ఎల్లేటి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కార్యకర్తలు, వాలంటరీ లు పాల్గొన్నారు.