ఆంధ్రప్రదేశ్న్యూస్ప్రాంతీయంరాజకీయం

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కోలా గురువులును అభినందించిన సన్యాసి పాత్రుడు.

విశాఖపట్నం, కోస్తా టైమ్స్ (జూలై -29 ) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కోలా గురువులును పూర్వ డిసిసిబి చైర్ పర్సన్ చింతకాయల అనిత భర్త,సీనియర్ రాజకీయ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడు సత్కరించి అభినందనలు తెలిపారు.శనివారం విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జరిగిన కోలా గురువులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు నాయకులు కోలా గురువులను అభినందించారు.కోలా గురువులు చేసిన సేవల్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.