ఆంధ్రప్రదేశ్జిల్లాలున్యూస్రాష్ట్రీయం

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

గ్రామీణ క్రీడలను ప్రోతహించాలి.
జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి.

అనకాపల్లి,(ఆగస్ట్ -29) : జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ గ్రౌండ్ నుండి 4 రోడ్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు, తదుపరి జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మాట్లాడుతూ క్రీడలను ప్రోతహించాల్సిన అవసరం ఉంది అని, అన్ని పాఠశాలల్లో పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలని ఆయన అన్నారు. డి.ఇ.ఓ. వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ జిల్లాలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాన్ని 2023 ఆగస్టు 25 నుండి 29వ తేదీ వరకు “సమిష్టి మరియు యోగ్యమైన సమాజం కోసం క్రీడలు సహాయపడతాయి” అనే థీమ్ తో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎస్ఓపి ప్రకారం 1.వాలీబాల్, 2. 100 మీటర్ల రేసు 3. హాకీ (నక్కపల్లి, హాకీ కోచింగ్ సెంటర్లో నిర్వహించారు) 4. లెమన్ రేస్, 5. టగ్-ఆఫ్-వార్ వంటి క్రీడలు పాఠశాలలు మరియు కళాశాలలు లో క్రీడలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. తదుపరి క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ లు,వ్యాయమ ఉపాధ్యాయులకు ప్రతిభ అవార్డ్స్ మరియు నేషనల్ ఛాంపియన్షిప్ లో మెడల్ గెలుపొందిన డి .కుసుమ – ఏషియన్ మెడలిస్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, కె.రామకృష్ణ- నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ టెన్ని కాయిట్ క్రీడాకారులకు జిల్లా కలెక్టర్, అనకాపల్లి వారి చేతులమీదుగా సన్మానించి మెరిటోరియస్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి వెంకట లక్ష్మి, డి.ఈ. ఓ మరియు స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ బోర్డు మెంబర్ జే. శ్రీనివాసరావు, మోటూరి నాగేశ్వర రావు, ఎస్ జిఎఫ్ఏపి, కేఎం నాయుడు, జిల్లా వ్యాయమ సంఘము ప్రెసిడెంట్,అనకాపల్లి, కిరణ్ మరియు చీఫ్ కోచ్, ఎల్.వి రమణ,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ,అనకాపల్లి మరియు క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు, జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…