న్యూస్ప్రాంతీయంమ‌న ఆరోగ్యంరాజకీయంస్థానికం

అందరికీ ఆరోగ్యం : జగనన్నసురక్ష లక్ష్యం

ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్

నర్సీపట్నం, కోస్తాటైమ్స్,( అక్టోబర్ 18) : రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం చేకూర్చడమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీలోని 16వ వార్డులోని కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు వార్డు కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత నెల 30వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి శిబిరానికి ముందుగా వాలంటీర్లు, వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, రోగులను గుర్తించి వారికి ప్రత్యేక టోకెన్లు ఇచ్చి శిబిరానికి తీసుకొచ్చేవరకు బాధ్యత తీసుకుంటారన్నారు. నిపుణులైన వైద్యులు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు.

ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు , వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ హనుతేజ్, డాక్టర్ మాధుర్య, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ మల్లికార్జునరావు, పట్టణ వైసిపి అధ్యక్షుడు యాకా శివ, కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శ్రీనివాస్, సచివాలయాల కోఆర్డినేటర్ తమరాన శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, వైద్య , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.