తెలంగాణ

ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు: భట్టి

తల్లాడ(సత్తుపల్లి), ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోయి, జ్ఞానం లేవని, ఎవరు చెప్పినా వినే రకం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలు విమర్శలు చేశారు. నోటికి వచ్చనట్లు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రిని కేసీఆర్ ఒక్కరేనని భట్టి తీవ్రస్థాయిలో విమర్శల పరంపర సాగించారు, ఎవరినైనా కొనగలనన్న నమ్మకం, మూర్ఖత్వం ఉన్న కేసీఆర్‌కు రైతులు, ప్రజలు కర్రుకాల్చి బుద్ధ వచ్చేలా వాతలు పెట్టాలని భట్టి అన్నారు.

రైతులతో ముఖాముఖీలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో రైతలుతో భట్టి విక్రమార్క, సీఎల్పీ బృందం మాట్లాడింది. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాల వీరభద్రం, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్ తదితార స్థానిక నాయకుల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశమంతా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. రైతాంగ సమస్యలు వదిలిస్తే దేశవ్యయసాయ రంగం అగమ్యగోచరంలా తయారవుతందన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే గమినించి ఉత్తర భారత రైతులు వారి ప్రాణాలు ఫణంగా పెట్టి 55 మంది చనిపోయినా పోరాటం చేస్తున్నారని భట్టి వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలు దేశానికి అత్యంత ప్రమాదకరమని భట్టి రైతులకు చెప్పారు. దేశాన్ని కాపాడేది జవాన్, దేశ ప్రజలకు అన్నం పెట్టేది కిసాన్ అని కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క నినాదంతోనే తమ విధానం స్పష్టం చేసిందని అన్నారు. మోదీ విధానాలతో రైతుల పరిస్థితి, భవిష్యత్ ఆందోళణకరంగా మారుతుందని అన్నారు. దేశంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారేనని, వారు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటే ఎక్కడ అమ్ము కుంటారని భట్టి ప్రశ్నించారు.

ఇక్కడ స్థానికంగా పండించే మిర్చి, పత్తి, పసుపు పంటను మండల కేంద్రానికి తీసుకెళ్లి అమ్ముకవడానికి ఇబ్బందులు పడుతున్న సమయంలో కల్లాల్లోనే అమ్ముకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏ మహారాష్ట్రకో, గుజరాత్‌కో పంటను తీసుకెళ్లి రైతు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతిని కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ చట్టాలు రైతుల కొసం కాదు, కేవలం బహుళజాతి సంస్థల కోసమో అన్ని వాస్తవం తెలుస్తుందని చెప్పారు. దేశ వ్యవసాయ రంగం మొత్తం కార్పరేట్‌ల చేతుల్లో పెట్టడం కోసమే ఈ చట్టాలు తీసుకువచ్చారన్నది స్పష్టమైన అంశమని చెప్పారు. ఇది నిజంగా రైతుల కోసమే తెచ్చిన చట్టాలు అయితే వారు వద్దని ఢిల్లీ సరిహద్దులో ప్రాణాలను లెక్కచేయకుండా దీక్ష చేస్తుంటే వెంటనే వాటిని వెనక్కు తీసుకునేవారిని చెప్పారు. కాంట్రాక్టు ఫార్మింగ్‌తో భూములను, పంటలను కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. అంబానీ, అదానీ వంటి వారితో సామాన్య రైతులు పోరాటం చేయలేరని అన్నారు.

ఆహర ధాన్యాలు అందరికీ అందుబాటులో ఉంచాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎసెన్షియల్ కమెడిటీస్ చట్టం తీసుకువచ్చిందని, దానివల్ల ధరల నియంత్రణ ఉంటుందని అన్నారు. కానీ దానిని ఎత్తేయడం వల్ల ఎవరైనీ ఎంతైన ఆహార పదార్థాలను, పంటలను గోడౌన్లలో దాచేస్తే అవి అందక ధరలు ఆకాశంలోకి వెళ్లే ప్రమాదం ఉందని, దీని వల్ల ఇటు వినియోగదారుడు అటు రైతులు తీవ్రంగా నష్టపోతారని భట్టి ప్రజలకు వివరించారు. ఇప్పటికే దేశవ్యాప్తగా అనే ఎఫ్‌సీఐ గోడౌన్లను అదానీ సంస్థకు కేంద్రం లీజుకు ఇచ్చిందని చెప్పారు. ఈ మూడు చట్టాలవల్ల దేశ రైతులకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దేశ స్వాతంతరం వచ్చిన తరువాత గణతంత్ర దినోత్సవం నాడు కేవలం సైనికుల కవాతు మాత్రమే ఉండేదని కానీ మొదటిసారి రైతులు బటయకు వచ్చి కవాతు చేశారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా రైతులంతా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని భట్టి విక్రమార్క చెప్పారు. మోడీ, కేసీఆర్‌లు కేవలం బహుళజాతి సంస్థల కోసం మాత్రమే పని చేస్తున్నారని, బీజేపీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన వారికి లేదని చెప్పారు. మోడీ, కేసీఆర్‌లకు ప్రజల సంక్షేమం అవసరం లేదని, కేవలం కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిద్దరికీ అధికారం తప్ప మరేమీ అవసరం లేదని చెప్పారు.

అదే సమయంలో ఈ మధ్య మద్దతు ధర ఉన్న సమయంలో మక్కల్ క్వింటాలకు రూ.1800 ధర పలికిందని, అదే మద్దతు ధర లేకపోతే వెంటనే రూ.900కి పడిపోయిందన్నారు. దీంతో రైతులకు క్వింటాలుకు రూ. 1000 నష్టపోయిన పరిస్థితి అని చెప్పారు. మద్దతు ధర లేకపోతే ఒక్క పంటకే ఇలా ఉంటే మొత్తంగా అసలు మద్దతు ధర లేకపోతే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకే అందడం లేదని భట్టి విక్రమార్క చెప్పారు.

‘‘ఢిలీ సరిహద్దుల్లో 85 రోజలుగా జరగుతున్న రైతు ఉద్యమం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యవసాయాన్ని పూర్తిస్థాయిలో కార్పొరేట్ చేసేలా కేంద్రం ప్రయత్నిస్తోంది. మార్కెట్ యార్డులను ఎత్తేసేలా కుట్రలు చేస్తున్నారు. దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వారికి మద్దతు ధర లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిట్టుబాటు, మద్దతు ధర కల్పించింది.’’ అని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘‘ఢిల్లీలో రైతులు మూడు నెలల నుంచి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 53 మంది చనిపోయినా రైతులు పోరాటం ఆపడం లేదు. రైతులకు కనీస మద్దతు ధర లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కేసీఆర్ కూడా మోదట చట్టాలను వ్యతిరేకించినా తరువాత యూటర్న్ తీసుకున్నాడు. ఈ బిల్లు వల్ల కార్పొరేట్లకు తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు.’’ మాజీ ఎంపీ వీ హనుమంతరావు పేర్కొన్నారు.

‘‘భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలపై సీఎల్పీ బృందం చేస్తున్న పోరాటం చాలా గొప్పది. ఈ పోరాటంలో భట్టికి మేము అండగా ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయి. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే. పేదలకు సేవచేసింది కాంగ్రెస్ మాత్రమే. మాట తప్పిన వాళ్లను ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు.’’ అని అన్నారు. మరోవైపు, సీఎల్పీ బృందానికి స్థానిక రైతులు తమ కష్టాలను, వ్యవసాయ రంగంలో సవాళ్లను వివరించారు.