నేరాలు .. ఘోరాలున్యూస్ప్రాంతీయం

చోరికి పాల్పడిన వ్యక్తికి 10 నెలలు జైలు శిక్ష

నర్సీపట్నం,జూలై -19 : తేది.14.08.2022న నర్సీపట్నం ఆర్.టి.సి.కాంప్లెక్స్ నందు బస్సు ఎక్కుచున్న కరణం నిరోషా యొక్క బంగారు ఆభరణములు చోరికి గురి కాబడగా ఆమె ఇచ్చిన రిపోర్టుపై నర్సీపట్నం టౌన్ స్టేషన్ సీఐ నమ్మి గణేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయబడి సదరు నేరమునకు పాల్పడిన వ్యక్తి అయిన జల్లి సుధాకర్ వయస్సు 23 సం అను వానిని సి.సి.కెమెరాల సహాయముతో పట్టుకొని రిమాండుకు తరలించడ మైనది.అనంతరము నర్సీపట్నం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ యస్.శశి చే సదరు కేసు వాదోప వాదాల చేయగా అనంతరం నర్సీపట్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ చోరికి పాల్పడిన వ్యక్తికి 10 నెలలు జైలు శిక్ష విధించారు…