ఆహారంసేవాఫదం

దక్షా భారత్ ఆధ్వర్యంలో పోలీసులకు మాస్కులు, సానిటైజర్లు పంపిణీ

నర్సీపట్నం: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా నిర్విరామంగా సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందికి రక్షణ కొరకు వారికి మాస్కలు, సానిటైజర్ బాటిల్స్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో టౌన్ సి.ఐ స్వామినాయుడు గారి దక్ష భారత్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ అడిగర్ల సతీశ్ అందించారు.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ జొగినాధునిపాలెం గ్రామంలో కిడ్నీ వ్యాధి,డయాలసిస్ వ్యాధితో ఇబ్బందిపడుతున్న ఒక యువకుడిని గుర్తించి.ఆ ఫ్యామిలీకి ఒక వారం రోజులు పాటు సరిపడే పప్పు దినుసులు, బియ్యం,సబ్బులు,సానిటైర్స్ , మాస్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిగర్ల సతీష్ , శ్రీరామ్ మూర్తి , శివ, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు…