న్యూస్ప్రాంతీయంవిశాఖపట్నం

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ విజయోత్సవం

  • 33 మందికి నియామక పత్రాలు అందజేత

నర్సీపట్నం, కోస్తాటైమ్స్, ( మే -2 ) : నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగ నియామకాలు పొందిన సందర్భంగా మంగళవారం కళాశాలలో ఉద్యోగ విజయోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సీపట్నం డిఎస్పి కే ప్రవీణ్ కుమార్, సాంకేతిక విద్యాశాఖ ఉపసంచాలకులు బి కళ్యాణ్ , గౌరవ అతిథిగా పయనీర్ అల్యూమినియం ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఎల్ ఎస్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీల్స్ ఇండియా లిమిటెడ్, ఎఫ్ట్రానిక్స్, సమీర్, పయనీర్ అల్యూమినియం తదితర కంపెనీలలో కొలువులు సంపాదించిన 33 మంది విద్యార్థినీ విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి వి రామచంద్రరావు మాట్లాడుతూ, గత జనవరి నుండి ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలో నిర్వహించగా కళాశాల విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని, మంగళవారం నియామక పత్రాలు అందుకున్న 33 మంది కాక మరో 25 మందికి నియామక పత్రాలు అందాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శాఖాధిపతులు విక్టర్ పాల్, నరసింహం, టి పి ఓ లు శ్రీనివాసరావు, ఉమా, లలిత ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.