ఆహారంజిల్లాలురాష్ట్రీయం

ఇసుక సరఫరా వేగవంతం చేయాలి- జె.సి ఎం.వేణుగోపాల రెడ్డి

విశాఖ‌స‌ట్నం : జిల్లాలో ఇసుక సరఫరా వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన ఇసుక లభ్యత, వాహనాల లోడింగ్, అన్లోడింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక వినియోగ దారులకు వీలైనంత వేగంగా సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వున్న వివిధ ఇసుక డిపోలలో ప్రస్తుత పరిస్థతిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గోదావరి వరదపోటు వున్నందున తూర్పు గోదావరి జిల్లా నుండి ఇసుక సరఫరా మందగించిందని, శ్రీకాకుళం నుండి వస్తున్న ఇసుకను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇసుక తరలింపుకు వచ్చే వాహనాల వివరాలను సాండ్ ఎన్ఫోర్స్ మెంటు వారికి తెలియజేయాలని ఆదేశించారు. ఇసుక లోడింగ్ అన్ లోడింగ్ లో వున్న లోపాలను తక్షణం పరిష్కరించాలన్నారు. ఇసుక సరఫరాలో జాప్యం లేకుండా ప్రణాళికా యుతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్.ఇ.బి. అడిషనల్ ఎస్.పి. రాహుల్ దేవ్ సింగ్, ఉప రవాణా కమిషనర్ రాజరత్నం, భూగర్భ గనులశాఖ సహాయ సంచాలకులు బెైరాగినాయుడు, వెంకటేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు…