నేరాలు .. ఘోరాలున్యూస్ప్రాంతీయం

ఏటిగైరంపేట వద్ద 24 కిలోల గంజాయి స్వాధీనం : ముగ్గురి అరెస్ట్.

నర్సీపట్నం ఏఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వెల్లడి.

నర్సీపట్నం,కోస్తాటైమ్స్,(జూలై -8) : గొలుగొండ మండలం ఏటి గైరంపేట వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 24 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని నర్సీపట్నం ఏఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు.శనివారం నర్సీపట్నం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఏటి గైరంపేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన మోటార్ సైకిల్ తనిఖీ చేయగా 12 ప్యాకెట్లలో 24 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు.ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని,వారి వద్ద నుండి మోటార్ సైకిల్ తో పాటు,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నా మన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కించంగి గ్రామానికి చెందిన బాపన రవికుమార్, సత్యసాయి జిల్లా హిందూపురం మండలం బసవన్నపురం గ్రామానికి చెందిన పి.చైతన్య కుమార్,కే. శంకరయ్యలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించా మన్నారు.ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ లో 2023 సంవత్సరంలో ఇప్పటివరకు 45 ఎన్డిపిఎస్ కేసులు నమోదు చేసి,918 కిలోల గంజాయిని పట్టుకున్నా మన్నారు.100 మందిని అరెస్టు చేశామన్నారు.యువత అక్రమ సంపాదనకు అలవాటు పడి గంజాయి రవాణా వంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల వైపు పడుతున్నారని,గంజాయి కేసులలో పట్టుబడితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని,ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన యువతకు సూచించారు.గంజాయి రవాణా పాత నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని,రెండు మూడుసార్లు గంజాయి కేసులలో పట్టుపడితే పీడీ యాక్ట్ పెడతామని ఆయన. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రమణయ్య,గొలుగొండ ఎస్సై నారాయణరావు తదితరులు పాల్గొన్నారు…