ఆంధ్రప్రదేశ్న్యూస్ప్రాంతీయంవిశాఖపట్నం

నర్సీపట్నంలో అంతర్ జిల్లా బాక్సింగ్, వూషూ, టైక్వాండో ఎంపిక.

వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన పీడీలకు ఘన సన్మానం.

నర్సీపట్నం, కోస్తాటైమ్స్, (జనవరి -29) : నర్సీపట్నంలోని నింజాస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్ జిల్లాల బాక్సింగ్, వూషూ, టైక్వాండో అర్హత పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో రాజమండ్రి, తుని, గాజువాక, గొలుగొండ, నర్సీపట్నం క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ పోటీలలో నర్సీపట్నం క్రీడాకారులు ప్రథమ స్థానం సాధించగా, ద్వితీయ స్థానం రాజమండ్రి క్రీడాకారులు గెలుచుకున్నారు.ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా పాఠశాలలకు, కళాశాలకు సంబంధించిన విద్యార్థినీ విద్యార్థులే అకాడమీ ద్వారా రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయస్థాయిలోను పతకాలు సాధించడంతో, వారిని ప్రోత్సహించిన వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ పిడి లక్ష్మి, బాలికల హైస్కూల్ పిడి అచ్చమ్మ, నేషనల్ సివిల్ సర్వీస్ వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం సాధించిన మల్లంపేట హైస్కూల్ పిడి దేవి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పీడీ ఎస్ సురేష్ బాబు, మరియు నాగజ్యోతి ( నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ) లు సన్మానం పొందిన వారిలోఉన్నారు. ఈ కార్యక్రమంలో శాఫ్ కోచ్ అబ్బు, నింజాస్ అకాడమీ చైర్మన్ వెలగా నారాయణరావు, అకాడమీ డైరెక్టర్స్, ప్రముఖ సైకాలజిస్ట్ సుమ, రమ, బిజెపి పట్టణ అధ్యక్షుడు వెలగా జగన్నాథం, బోలెం శివ, అడిగర్ల సతీష్, సీనియర్ కోచ్ శేఖర్, బాక్సింగ్ రెఫరీ కోచ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.